ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి జీవితం.. మరెక్కడో ఉన్న మరో వ్యక్తి జీవితంతో ముడిపడి ఉండొచ్చు.  ఆ ఇద్దరి వ్యక్తులు కలిసేందుకు ఒక మీడియం అవసరం అవుతుంది.  సమయం వచ్చినపుడు తెలియకుండానే ఆ మీడియం ఆ ఇద్దర్ని కలుపుతుంది.  ఫలితంగా ఏదైనా జరగొచ్చు.  

కోలీవుడ్ ఇండస్ట్రీలోకి సమంత అడుగుపెడుతుందని అనుకోలేదు.  చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.   ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సమంత కుటుంబానికి చాలా మంది హెల్ప్ చేశారు.  అది సమంత మనసులో బాగా నాటుకుపోయింది.  పెద్దయ్యాక మంచి ఇల్లు.. బ్యాంకులో ఓ 50 లక్షల డబ్బు ఉండాలని, తల్లిని బాగా చూసుకోవాలని అనుకుంది.  

అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది.  తెలుగులో నాగచైతన్యతో ఏం మాయచేశావే సినిమా చేసింది.  సినిమా సూపర్ హిట్.  మొదటి సినిమా నుంచి చైతు చాలా బాధ్యతగా ఉంటాడు.  కేరింగ్ పర్సన్.  అదే సమంతను ఎట్రాక్ట్ చేసింది. 

ఆ తరువాత వరసగా 5 సినిమాలు హిట్ అయ్యాయి.  లక్కీ హీరోయిన్ గా పేరు వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించింది.  కష్టాలు ఎలా ఉంటాయో చూసింది కాబట్టి సమంత సాయం చేయడం మొదలుపెట్టింది.  ఎంతోమందికి ఎన్నో రకాల సాయం చేసింది.  చైతూ బాధ్యతగల భర్త అంతే బాధ్యతను సినిమా రంగంలో కూడా చూపిస్తాడు.  చైతూను చూసి తానుకూడా మారినట్టు సమంత చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: