దాదాపుగా మెగాస్టార్ సైరా షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది.  కీలక సన్నివేశాలను పాండిచ్చేరిలో షూట్ చేస్తున్నారు.  మెగాస్టార్ కు సంబంధించిన సీన్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి.. కాబట్టి మెగాస్టార్ ఇపుడు తన పాత్ర డబ్బింగ్ పై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ పాత్ర కోసండబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.  నాలుగైదు రోజుల్లో ఈ డబ్బింగ్ ను ఫినిష్ చేయబోతున్నారు. 

కంప్లీట్ అయిన వెంటనే మెగాస్టార్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారట. ఆగష్టు 22 వ తేదీన చిరంజీవి సైరాకు చెందిన టీజర్ రిలీజ్ ఉంటుంది.  

ఇక అదే రోజున మెగాస్టార్.. కొరటాల శివ కొత్త సినిమా ఓపెనింగ్ ఉంటుంది.  ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.  ఈ సినిమాలో మెగాస్టార్ డబుల్ రోల్ చేయబోతున్నారు.  ఒకటి రైతు పాత్ర కాగా రెండోది ఎన్ఆర్ఐ పాత్ర.  

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగష్టు 22 వ తేదీన వెల్లడించనున్నారు.  ఇకపోతే, మెగాస్టార్ సినిమాను మాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నది.  ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: