మొత్తానికి టీజర్ పుణ్యమా అని భార్యా భర్తలిద్దరు నెటిజన్ల తో తెగ తిట్టించుకుంటున్నారు. మన్మథుడు-2 టీజర్ లో ఓ రేంజ్ లో రొమాన్స్ చేశాడు నాగార్జున. లేటు వయసులోను ఘాటుగా ముద్దులు పెట్టి యూత్ నాతో పెట్టుకోకండి నేను నవ మన్మథుడిని అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఈ టీజర్ కూడా ఆర్.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి రేంజ్ లో బాగా క్లిక్ అయింది. అయితే సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు కూడా ఘాటుగా వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే..ఈ చిత్ర యూనిట్ తో సంబంధం లేకుండా ఓ గాయని సమంతకు గొంతు అరువిచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనవసరంగా బుక్ అయింది.  


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు-2 తన భర్త రాహుల్ తీస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమా టీజర్ ను చిన్మయి షేర్ చేసింది. అంతే ఇక మొదలైంది..మీ-టూ ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం అంటూ నీతులు చెప్తున్న చిన్మయి.. మన్మథుడు ముద్దుల్ని మాత్రం సమర్థిస్తోందంటూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. 3 రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారంపై రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయ్యాడు. మన్మథుడు-2లో రొమాన్స్ కు మీ-టూ ఉద్యమానికి సంబంధం ఏంటని 'చిన్మయి' కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకమని చెప్పింది తప్ప, సెక్స్ కు కాదని తన భార్య ను వెనకేసుకొచ్చాడు.


అయితే రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఈ మాట నెటిజన్లకు మరో బూతులా వినపడింది. 59 ఏళ్ల నాగార్జునతో 20 ఏళ్ల అమ్మాయి చేసే సెక్స్ చూపించడమే నీ ఉద్దేశమా అంటూ రాహుల్ పై రివర్స్‌లో కామెంట్స్ పడుతున్నాయి. అలాంటప్పుడు మన్మథుడు కంటే కూడా కామాంథుడు అని పేరుపెట్టుకుంటే బాగుంటుంది కదా అంటూ ఘాటుగానే సెటైర్లు పడుతున్నాయి. టీజర్ లో రకుల్ ను చూపించలేదు కాబట్టి సరిపోయింది. రేపోమాపో నాగ్-రకుల్ రొమాన్స్ క్లిప్స్ కూడా రిలీజ్ చేస్తే, ఈ విమర్శలు ఇంకాస్త ఎక్కువవడం ఖాయం. అయితే యూనిట్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉంది. మరి ఇది కూడా సినిమా పబ్లిసిటీకి పనికొస్తుందనే ఉద్దేశ్యమేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: