Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 3:35 pm IST

Menu &Sections

Search

ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??

ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పెళ్లిచూపులు సినిమాతో హీరోగా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా, సూపర్ సక్సెస్ సాధించి విజయ్ కి యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఆపై ఆయన నటించిన గీత గోవిందంతో విజయ్ ఒక స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించారు. ఇక ప్రస్తుతం అయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. 

అందులో ఒకటి భరత్ కమ్మ దర్శకత్వంలో నటిస్తున్న డియర్ కామ్రేడ్ కాగా, మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. అయితే డియర్ కామ్రేడ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేనెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో అయన నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా విరామం లేకుండా జరుగుతుంది. ఇకపోతే నేటి ఉదయం నుండి విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. విజయ్ మరియు క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమాలో అయన మూడు విభిన్న పాత్రల్లో కనపడనున్నట్లు సమాచారం. 

అంతేకాక సినిమాలో మూడు రకాల కథలు చూపించడం జరుగుతుందని, ఇక వాటికి సంబంధించి మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నాయని, ఇక క్లైమాక్స్ లో ఎవరూ వూహించని విధంగా వచ్చే ట్విస్ట్ అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. నిజానికి విజయ్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్స్ ఈ సినిమాలో పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంతవరకు ఉందొ తెలియదుగాని, ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిలో నిజానిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే...!! 


vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.