టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నిజజీవితంలో కూడా మంచి మంచి పనులు చేస్తూ మనిషి హృదయాలను కొల్లగొడుతున్నడు. గతంలో శ్రీమంతుడు సినిమా వచ్చిన సందర్భంలో మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ ఊరిలో పలు సేవా కార్యక్రమాలు కూడా మహేష్ బాబు చేపట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఒక సంచలన కరమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది.


అదేమిటంటే మహేష్ బాబు గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు వెయ్యి మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సలన్నీ విజయవంతంగా చేయించినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్, ఇంగ్లాండ్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండషన్ సంస్థల సహకారంతో మహేష్ బాబు ఈ అద్భుత కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నమ్రత తెలిపింది. మంచి కార్యక్రమానికి తనవంతు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు నమ్రత ధన్యవాదాలు తెలిపింది. ఆయన వైద్య బృదం కూడా ఎంతో గొప్పగా సహకరించారని పేర్కొంది.


డాక్టర్ రామారావు మాట్లాడుతూ చిన్నారుల గుండె చికిత్సకు మహేష్ బాబు విరాళాలు అందించారని పేర్కొన్నారు. అదే విధంగా శస్త్రచికిత్స తర్వాత అవసరమయ్యే మెడికల్ ఖర్చులని కూడా మహేష్ బాబే చూసుకుంటున్నారని తెలిపారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తమ హీరో చేసిన సేవ పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..మహేష్ కి అభిమానులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని ఎక్కడైనా మేము కాలరెగరేసి మహేష్ అభిమాని అని చెప్పు కొంటామని ఇంకా మా హీరో మంచి పనులు చేయాలని సోషల్ మీడియా లో కామెంట్ లో చేస్తున్నారు ఫాన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: