సినిమాలతో సమాజానికి గొప్ప సందేశాలను ఇచ్చే సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నిజ జీవితంలోనూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. గత మూడున్నరేళ్లలో ఆయన వెయ్యి మందికిపైగా చిన్నారులకు గుండె సంబంధ శస్త్రచికిత్సలు చేయించారు. మహేశ్‌తో కలిసి ఆంధ్రా హాస్పిటల్స్ హాస్పిటల్, వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించింది.

 

ఇప్పటివరకు వారు వెయ్యి మందికి పైగా మంది చిన్నారులకు విజయవంతంగా హృదయ సంబంధిత శస్త్ర చికిత్సలు చేసింది. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, బ్రిటన్‌కు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

 

ఓ మంచి పని కోసం తమకు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు ఆమె థ్యాంక్స్ 2018 డిసెంబర్ నాటికి 150 మంది చిన్నారులకు గుండె సంబంధిత చికిత్సలు జరిపించామని గతంలో నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పసి ప్రాణాలను కాపాడటం కోసం మహేశ్ దంపతులు చేస్తున్న ఈ మంచి పనిని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

 

రాబోయే రోజుల్లో తమ సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని సేవ కార్యక్రమాలు చేయవలసిందిగా అభిమాన వర్గం కోరుకుంటున్నారు.  మహేష్ ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న విషయం మనకు తెలిసినదే.  ఏదేమైనా అగ్ర హీరోలు అనిపించుకున్నవారు ఇలా స్ఫూర్తిదాయకంగా ఉంటే అది దేశానికే గర్వకారణమని ప్రముఖులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: