సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా అప్పుడప్పుడు ఒకరి మీదఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇవి చాలా తక్కువ. వాళ్ళలో వాళ్ళకు ఎన్ని ఉన్నా బయటకు తెలియవు. రీసెంట్ గా  ఒక గాయని " సల్మాన్ ఖాన్" ని విమర్శించి హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ లో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

 

రీసెంట్ గా రంజాన్ పర్వదినాన రిలీజైన సల్మాన్ ఖాన్ " భారత్" సినిమాని ఉద్దేశించి ఈమె విమర్శలు చేసింది. " భారత్" సినిమా విడుదలైన మొదటివారం కలెక్షన్లు బానే వచ్చాయి. తరువాతి వారం నుండి బాక్సాఫీసు వద్ద  తన వేగాన్ని తగ్గించింది. కలెక్షన్లు అనుకున్న మేరకు రాలేదు. కనీసం 200 కోట్ల గ్రాస్ రాబడుతుందో లేదో కూడా అనుమానమే.

 

ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ " సోనా మహాపాత్ర" తన ట్విట్టర్ ద్వారా  చురకలంటించింది. మొదటి వారంలోనే కలెక్షన్లను రాబట్టుకోలేకపోయిన వారిని సూపర్ స్టార్స్ అని ఎందుకంటారో అర్థం కావట్లేదు అంటూ ట్వీట్ చేసింది. అంతేగాక తన విజ్ఞప్తిగా ఇటువంటి సూపర్ స్టార్లని అభిమానించడం మానేసి మన పని మనం చేసుకోవడం మంచిదని అభిమానులకు హితభోధ చేసింది.

 

ఇదిలా ఉండగా సోనా మహాపాత్ర సల్మన్ ఖాన్ ని విమర్శించడం ఇది మొదటి సారేం కాదు. భారత్ సినిమా ప్రచారంలో భాగంగా సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా  సినిమా నుండి తప్పుకున్నందుకు  కత్రినా కైఫ్ ని తీసుకున్నామని, ప్రియాంక చోప్రా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఐదు రోజుల ముందు చిత్రం నుండి తప్పుకుంటున్నానై చెప్పిందని చెప్పాడు. ఆ ఐదు రోజుల్లో కత్రినా కైఫ్ ని ఒప్పించామని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మీద కూడా సింగర్ సోనా మహాపాత్ర విమర్శలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: