అనేక ఆలోచనలు తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తానా సంస్థ ఒత్తిడికి తల ఒగ్గి వచ్చేనెల జూలై మొదటివారంలో అమెరికాలోని వాషింగ్టన్ లో జరగబోతున్న తానా సంస్థ కార్యక్రమానికి అతిధిగా రావడానికి అంగీకరించాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తెలియ చేస్తూ తానా సంస్థ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. 

సుమారు 15 వేల మంది తెలుగు వారు పాల్గొని ఈ సభలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తెలుగు ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు వివిధ కళాకారులను రచియితలను మేధావులను పిలిచి వారిని సత్కరించడమే కాకుండా వారి చేత ఉపన్యాసాలు కూడ ఇప్పిస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు పవన్ వెళ్ళడం వెనుక ఒక ఆసక్తికర డ్రామా నడిచినట్లు టాక్.

వాస్తవానికి ఈ ఈవెంట్ కు రమ్మని ఈ సంస్థ నిర్వాకులు ఎన్ని సార్లు పిలిచినా పవన్ స్పందించ లేదని తెలుస్తోంది. అయితే ఈ సంస్థ అధ్యక్షుడు సతీష్ వేముల చిరంజీవి ద్వారా నడిపించిన రాయబారాలతో పవన్ ఈ సభలకు రావడానికి ఒప్పుకున్నట్లు టాక్. వాస్తవానికి ‘జనసేన’ ఘోర పరాజయం తరువాత నైరాశ్యంలో ఉన్న పవన్ కు ఒక ఉత్తేజం కలిగించడానికి చిరంజీవి చాల వ్యూహాత్మకంగా పవన్ ను ఈ ఫంక్షన్ విషయంలో ఒప్పించాడు అని అంటారు. 

వాస్తవానికి జనసేన రాజకీయాలు కొనసాగిస్తూ తన సినిమా కెరియర్ ను కొనసాగించమని చిరంజీవి అనేక సార్లు చెప్పినా పవన్ ఒప్పుకోలేదు అన్న వార్తలు ఉన్నాయి. తాను సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాను అంటూ స్పష్టంగా పవన్ తన నోటి వెంట చెప్పిన తరువాత సినిమా సెలెబ్రెటీలు అనేకమంది పాల్గొన బోతున్న ఈవెంట్ కు ఇప్పుడు పవన్ అతిధిగా వేల్లబోతున్నాడు. ఇలాంటి సందర్భంలో పవన్ కు తానా ఫంక్షన్ లో తిరిగి సినిమాలలో నటించమని ఒత్తిడి వచ్చే ఆస్కారం ఉంది. దీనికితోడు ప్రస్తుత రాజకీయాల పై ఎన్నికలలో ధన ప్రవాహం పై వేధికగా పవన్ తన ఓటమి తరువాత అందరి ఎదుటకు వచ్చి చేయబోతున్న కీలక ప్రసంగం పై అత్యంత ఆసక్తి కలుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: