షాహిద్ కపూర్ ప్రస్తుత సినిమా " కబీర్ సింగ్" 21 వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ ప్రమోషన్ల లో చాలా బిజీగా ఉన్నాడు. "కబీర్ సింగ్" తెలుగులో సూపర్ హిట్ సాధించిన "అర్జున్ రెడ్డి" సినిమాకి రీమేక్. తెలుగులో దర్శకత్వం వహించిన "సందీప్ రెడ్డి వంగా" హిందీలో కూడా దర్శకత్వం చేసారు. షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది. షాహిద్ కపూర్ ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు.

 

ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తక్కువ టైంలోనే ట్రెండింగ్ లోకి వచ్చింది.  ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా షాహిద్ కపూర్ చాలా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాడు . ఒకానొక ఇంటర్వ్యూలో మీ తర్వాతి సినిమా ఏంటి అని అడిగితే, తన తర్వాతి సినిమాకి ఇంతవరకు సైన్ చేయలేదట. ప్రస్తుతం నేను నిరుద్యోగినని చెప్పాడు. కానీ అది తనకి ఏం బాధగా లేదని చెప్పాడు.

 

సినిమాలు లేకపోతే తాను వేరే పనుల్లో చాలా బిజీగా ఉంటానని, మరో సినిమా వచ్చే వరకు తనకి ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం మాత్రం  తాను నిరుద్యోగిని అని అన్నాడు. సినిమాలు లేకపోయినంత మాత్రాన ఖాళీగా ఉన్నట్టు కాదని, ఏదో ఒక పని ఉంటుందని,  చేసేందుకు చాలా పనులున్నాయని , సినిమాలు లేనప్పుడు ఆ పనులు చేసుకుంటానని చెప్పాడు.

 

కబీర్ సింగ్ సినిమా కోసం షాహిద్ కపూర్ చాలా కష్ట పడ్డాడు. 38 ఏళ్ళ షాహిద్ కపూర్ ఒక కాలేజి బాయ్ గా కనిపించడానికి చాలా కష్ట పడాల్సి వచ్చిందట. ఆ సంగతి ట్రైలర్ లో చూస్తే అర్థమైపోయింది.  ఇక ఈ సినిమా రిలీజయ్యాక తన తర్వాతి చిత్రాన్ని ప్రకటిస్తాడేమో చూడాలి. ట్రైలర్ వచ్చిన స్పందన చూస్తుంటే, సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: