సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో నటించింది కియారా. భరత్‌ అనే నేనుతో తెలుగులోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయిక కియారా అడ్వాణీ.  ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’తో సందడి చేసింది. కబీర్ సింగ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ఒక టి.వి ఇంటర్వ్యూ లో ఆమె పేర్కొన్న విషయాలివి...

 

నేనూ తెలుగులో నా మూడో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చాలా కథలు వింటున్నాను. హైదరాబాద్‌ నా రెండో ఇల్లులాంటిది. ఇక్కడికి వచ్చినప్పుడంతా చాలా సంతోషంగా ఉంటుంది. అర్జునరెడ్డి సినిమా విడుదలైనప్పుడే చూశా. నాకు చాలా బాగా నచ్చింది. విజయ్‌ దేవరకొండకి అభిమానిగా మారిపోయా. అదే సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం ఒక కలలా అనిపించింది.

 

షాలినిని కలవలేదు. విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశా. ‘అర్జున్‌రెడ్డి’ గురించి మాట్లాడుకున్నాం కానీ, తనేం   సలహాలు ఇవ్వలేదు. సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండమని చెప్పాడంతే. అంచనాలెక్కువగా ఉంటాయి. మాతృకని చాలా మంది చూసుంటారు. దానికంటే కొత్తగా ఏం చూపించాలనే ఓ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. సందీప్‌రెడ్డి వంగా ఒక రీమేక్‌   సినిమాలాగా తెరకెక్కించలేదు. మరో కొత్త కథ అన్నట్టు చూపించారు.

 

నాకు హారర్‌ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ‘కాంచన’ సినిమాని నేను చూడలేదు కానీ... లారెన్స్‌ చెప్పిన స్క్రిప్టు విన్నప్పుడు ఎంజాయ్‌ చేశా. ‘కాంచన’కి రీమేక్‌గానే ‘లక్ష్మీబాంబ్‌’ తెరకెక్కుతోంది. ఇందులో హారరే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. అందుకే చేస్తున్నా. ఒక నటిగా నాకు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఒక్కటే. యువతరం వెబ్‌ సిరీస్‌లు బాగా చూస్తారు. వాళ్లకి మరింత దగ్గర కావడానికి అవి చేయడంలో తప్పులేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: