మన దేశపౌరుల్లో ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలో వారు చేరడం, అలానే ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పడం వంటివి చేసే హక్కు ఉంటుంది. అందుకు సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లి రాజకీయాల్లో చేరిన వారికీ ఎటువంటి మినహాయింపు ఉండదు. అయితే కొందరు మాత్రం ఇతర పార్టీల్లో ఉన్న నటులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వలన ఒక్కోసారి అది వారి సినిమా కెరీర్ కు ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇటీవల సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్ళి పలు పార్టీల్లో చేరిన వారిలో కమెడియన్ పృథ్వి కూడా ఒకరు. 

వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి పార్టీలో చేరిన పృద్వి, జగన్ ముఖ్యమంత్రి కావాలని, దానికోసం తనవంతుగా సాయపడతానని మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడం, అలానే వైఎస్ జగన్ సీఎం అవడం జరిగిపోయాయి. ఇక మొదటినుండి ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడే పృథ్వి, ఒకానొక సమయంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ లను కూడా విమర్శించక తప్పలేదు. అయితే తమ పార్టీ విజయానంతరం కూడా పృద్వి వారిద్దరినీ ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారంటూ పలువురు మెగాభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో పృథ్వి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న త్రివిక్రమ్, బన్నీ లేటెస్ట్ మూవీలో పృథ్వి కోసం రాసుకున్న ఒక రోల్ ఉందని, 

అయితే దానికోసం అతడి స్థానంలో వేరొకరిని తీసుకోవాలని బన్నీ, త్రివిక్రమ్ కి సూచించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో మాత్రమే కాక ఇటీవల మెగాబ్రదర్స్ పై విమర్శలు చేస్తున్నందువల్ల పృథ్వికి కొన్ని ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు చేజారాయి అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజనిజాలు తేలాల్సి ఉంది. ఇక ఈ విషయమై సినీ విశ్లేషకులు కొందరు మాట్లాడుతూ, అసలు సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని, ఎవరైనా ఒక వ్యక్తి చేసే విమర్శలు అతడి వ్యక్తిగతమని, అయితే వాటిని పట్టుకుని ఆ వ్యక్తికి అవకాశాలు ఇవ్వడం లేదు అనడం సరైనది కాదు, అదంతా ఒట్టి పుకారు అని కొట్టిపారేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: