బిగ్ బాస్ సీజన్ 3 మొదలై పోవడానికి అంతా సిద్ధమైపోయింది. మరికొద్ది రోజుల్లో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించనున్న ఈ రియాల్టీ షోలో అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు. గతంలో మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ తర్వాత హోస్టింగ్ చేసిన న్యాచురల్ స్టార్ నాని పర్వాలేదనిపించారు.


అయితే తాజాగా నాగార్జున మూడవ సీజన్ కి హోస్టింగ్ చేయడానికి రెడీ అవడంతో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ అభిమానులు సీజన్ 3 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో త్వరలో మొదలు కాబోయే సీజన్ 3 లో షో నిర్వాహకులు కంటెస్టెంట్ లను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామందిని హౌస్ నెంబర్ ని ఫైనలైజ్ చేసినట్లు ఆ వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు.


ఇక అసలు మేటర్లోకి వెళితే….షో కోసం నిర్వాహకులు ప్రోమోస్ సిద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. స్పెషల్ గా వేసిన కొన్ని సెట్స్ లలో రోజు కనిపిస్తున్న నాగ్ బిగ్ బాస్ 3 మొదటి షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం నాగ్ తో కొన్ని ప్రోమోలను షూట్ చేస్తున్న నిర్వాహకులు త్వరలో ఒక స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: