హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తన సినిమాలని మార్కెట్ లోకి తీసుకెళ్ళడానికి సరికొత్త స్ట్రాటెజీ లని ఎంచుకుంటుంది. ఈ సంస్థ నుండి వస్తున్న  తర్వాతి చిత్రం " ది లయన్ కింగ్" సినిమాకి ఈ వ్యూహాలని అప్లై చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అందుకని కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేయడానికి సిద్ధమవుతుంది.

 

ఈ సినిమా హిందీ వెర్షన్ కి బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నాడు.  ఈ సినిమాలోని  కింగ్ ముఫాస పాత్రకి షారుక్ ఖాన్ , ముఫాస కొడుకు "సింబ" పాత్రకి షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నారు. నిన్నే దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చింది.

 

" డిస్నీ నిర్మించే అన్ని సినిమాలు తమకి బాగా ఇష్టమని, ది లయన్ కింగ్ సినిమా డబ్బింగ్ చెప్పడం ఒక మంచి అనుభూతి అని చెప్పాడు. డిస్నీ ఇలా డబ్బింగ్ చెప్పించడం ఇది మొదటిసారేం కాదు. లోకల్ వాళ్ళకి అనుగుణంగా మార్చి క్యాష్ చేసుకోవడంలో డిస్నీ ఎక్స్ పర్ట్. ఇంతకుముందు 2016 లో వచ్చిన "జంగిల్ బుక్" సినిమాకి కూడా బాలీవుడ్ తారలు తమ గొంతు వినిపించారు. ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, నానా పాటేకర్ లాంటి వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు.

 

మొన్న వచ్చిన "అవెంజర్స్ ఎండ్ గేమ్" సినిమాకి కూడా లోకల్ వాళ్ళతో డబ్బింగ్ చెప్పించి,ప్రతీ ప్రాంతానికి చేరువ చేసి కోట్లు కొల్లగొట్టారు. ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు  మురుగదాస్ తమిళ వెర్షన్ కి డైలాగులు రాసాడు. తెలుగులో రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పాడు. మొన్న వచ్చిన "అల్లాద్దిన్" సినిమాకి ఏ ఆర్ రెహమాన్ ఒక ప్రత్యేక గీతాన్ని కూడా కంపోజ్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: