ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి తొలి అడుగులు వేస్తూ ముందుగా బెల్ట్ షాపులను మూయించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో మద్యపానం వల్ల వచ్చే నష్టాలను పేదలకు వివరించడానికి చేపట్టపోయే భారీ ప్రచార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే ఎలా ఉంటుంది అన్న సూచనలు కొంతమంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చేసినట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటలలోనే ఈ వార్తలలోని యదార్ధత గురించి జూనియర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారివారి స్థాయిలలో లోతైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. 

మరికొందరు జూనియర్ సన్నిహితులితే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ వార్తలను తారక్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ వార్తలను సన్నిహితులుద్వారా తెలుసుకున్న జూనియర్ కొద్దిగా షాక్ అయినట్లు సమాచారం. తాను రాజకీయాలకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నా తన పై ఇలా వస్తున్న వార్తలు కొంత వరకు జూనియర్ ఆశ్చర్యాన్ని కలిగించినట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తప్ప మరొక విషయం పట్టించుకోలేని పరిస్థితిలో జూనియర్ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ బ్రాండ్ అంబాసిడర్ వార్తల పై ప్రస్తుతానికి క్లారిటీ వచ్చే ఆస్కారం లేదు. జూనియర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని కీలక నేతగా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్న నేపధ్యంలో ఇలాంటి వార్తలు వచ్చి ఉంటాయని జూనియర్ సన్నిహితులు భావిస్తున్నట్లు టాక్. 

దీనికితోడు జూనియర్ ఎన్టీఆర్ మామగారు కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చాల యాక్టీవ్ గా ఉన్న నేపధ్యంలో ఇలాంటి లీకులు వచ్చి ఉంటాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం గత కొన్నిరోజులుగా జూనియర్ చుట్టూ రాజకీయాలకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలను జూనియర్ ఖండించకుండా వ్యూహాత్మక మౌనం కొనసాగించడం బట్టి జూనియర్ మనసులో ఎదో ఒక ఆలోచన ఉంది అన్న సందేహాలు రావడం యదార్ధం..    


మరింత సమాచారం తెలుసుకోండి: