ఎన్టీఆర్‌తో నాకు పెద్దగా పరిచయాలు లేవు. నాన్నగారు సినిమాలు తీశారు. నేను ఒకట్రెండు సార్లు కలిశాను అంతే. అన్నయ్యకు బాగా పరిచయం ఉంది. నాగేశ్వరరావుగారితో బాగా మాట్లాడేవాడిని. దాసరిగారు, రాఘవేంద్రరావుగారు తాము తీయబోయే సినిమా కథను నాకు కూడా చెప్పేవారు. వారు చెప్పిన కథకు నా నుంచి ఏవైనా సలహాలు వస్తాయేమోనని అనుకునేవాళ్లు.

 

ప్రేమాభిషేకం  చూసి బయటకు వచ్చాను. అప్పుడే దాసరిగారు, నాగేశ్వరరావుగారు బయట నిలబడి ఉన్నారు. నేను వాళ్లను చూసి మాట్లాడకుండా వెళ్లిపోయాను. మరుసటి రోజు నాగేశ్వరరావుగారు సెట్‌కు వచ్చారు. ‘ఏంటయ్యా! రాత్రి సినిమా చూసి మాట్లాడకుండా  వెళ్లిపోయావు’ అని అడిగారు.‘సర్‌ సినిమా చూసిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదండీ.  'బాగా ఆడుతుంది' అని చెప్పా.

 

అన్నపూర్ణా స్టూడియోస్‌లో వేశారు. అప్పట్లో చాలా ఖర్చుతో కూడుకున్న సెట్‌ అది. ‘మొగుడు కావాలి’ సినిమా కోసం ఆ సెట్‌ అడిగాం. ‘నువ్వు భరించలేవయ్యా! మేము వేసే ఛార్జీలు కట్టలేరు’ అన్నారు. ‘నాకోసం తగ్గించి ఇవ్వొచ్చు కదా’ అని అడిగా. ‘నేను ఇవ్వను. నీ సినిమాకు తగ్గిస్తే, భరద్వాజకు తగ్గించావు కదా! మాకెందుకు తగ్గించి ఇవ్వరు? అని మరొకరు అడుగుతారు. దాంతో మా మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి.

 

సరే, నీ దగ్గర ఎంత ఉంటే అంతే ఇవ్వు. నా దగ్గర ఉన్న మెటీరియల్‌ మొత్తం ఫ్రీ గా వాడుకుని సెట్‌ వేసుకో’ అని అన్నారు. రెండు రోజుల తర్వాత నేను షూటింగ్‌ వెళ్తే, నా సినిమా సెట్‌ ముందు నాగేశ్వరరావుగారు కనిపించారు. ‘సారీ! భరద్వాజ. సెట్‌ లేటైంది. ఓ గంట ఓపిక పట్టు సెట్‌ పూర్తి చేసి ఇచ్చేస్తాం’ అన్నారు. అంత పెద్ద వ్యక్తి నాకు సారీ చెప్పాల్సిన పనిలేదు. కానీ, చెప్పారు. అది ఆయన గొప్పతనం. అందుకే మహానటుడు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: