అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువల్ వండర్ కి షారుఖ్ ఖాన్ గాత్ర ధానం చేశాడు. లయన్ కింగ్ లో కీలక పాత్రైన ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా తనయుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.