చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ అక్కినేని హీరోగా చేయబోయే సినిమాకు అంతా రెడీ అయింది. సినిమాలో కాస్టింగ్ కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 26 నుంచి షెడ్యూలు స్టార్ట్ కాబోతోంది. కానీ ఇప్పటికీ ఫైనల్ అవనివి రెండే విషయాలు. ఒకటి ఈ సినిమా టైటిల్ ఏంటని.. రెండవది అఖిల్ కి జంటగా ఏ హీరోయిన్ నటిస్తుంది. అఖిల్ సరసన హీరోయిన్ ను ఫిక్స్ చేయడం అంత ఈజీ కాదు. అఖిల్ అన్ని సినిమాల విషయంలో కూడా హీరోయిన్ ఫిక్స్ చేయడం కాస్త ఆలస్యమే అయింది.


అఖిల్ సరసన కొత్త అమ్మాయిలను చూస్తున్నారు. ఆడిషన్లు చేస్తున్నారు. అదే టైమ్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త లైమ్ లైట్ లో వున్నవాళ్ళ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పడిప్పుడే వచ్చిన, వస్తున్న అమ్మాయిల దగ్గర నుంచి కాస్త పాపులర్ యంగ్ హీరోయిన్ల పేర్లు అన్నీ పరిశీలనలో వున్నాయి అని వినిపిస్తోంది. కానీ ఇంతవరకు ఎవరినీ ఫిక్స్ చేయలేదు. 


ఇందులో భాగంగా నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న బన్నీవాస్ ఓ షార్ట్ లిస్ట్ ను తయారుచేసే పనిలో వున్నారని లేటెస్ట్ న్యూస్. అది రెడీ అయితే, అఖిల్ తో డిస్కషన్లు షురూ అయి, హీరోయిన్ ఫైనల్ అవుతుంది. ఈ సినిమాను వీలయినంత త్వరగా రెడీ చేసి, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: