ఆడవాళ్లు బయటకు రారు... వచ్చినా.. వాళ్ళ పని ఎదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అని అంటుంటారు.  కాలం మారడంతో పరిస్థితులు మారిపోయాయి. మగవాళ్ళతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు.  అన్ని రంగాల్లో వాళ్లతో పాటు సమానంగా ఎదుగుతున్నారు.

ఓ విషయం చెప్పాలంటే మగవాళ్ల కంటే ఎక్కువగా ఎదుగుతున్నారు అని చెప్పొచ్చు.  ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఇప్పుడంటే సరే.. గతంలో మహిళలను పెద్దగా పట్టించుకోని రోజుల్లో.. మహిళలు పురుషులకు ధీటుగా ఎదిగారు.  వాళ్లతో సమానంగా ముందుకు నడిచారు.  ఎక్కడ అనుకుంటున్నారు.. సినిమా రంగంలో. 


సినిమా రంగంలో మహిళల గురించి చెప్పాలి అంటే మొదటగా చెప్పుకోవాల్సింది భానుమతిని.  భానుమతి మల్టీటాలెంటెడ్ నటి.  నటిగా చేస్తూనే.. రైటర్ గా మారింది.  దర్శకురాలిగా మారి సినిమాలు తీసింది.  పాటలు రాసింది.. పాడింది.  ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగులో మొదటి మహిళా దర్శకురాలు ఎవరు అంటే భానుమతి చూపించవచ్చు.  


భానుమతి స్పూర్తితో సినిమాల్లో మహానటిగా పేరు పొందిన సావిత్రి ప్రాప్తం, చిన్నారి పాపలు, మాతృదేవత వంటి సినిమాలు చేసింది.  ఆ తరువాత తరానికి దర్శకురాలిగా పరిచయమైనా నటి విజయ నిర్మల.  1971లో వచ్చిన మీనా సినిమాతో మెగాఫోన్ పట్టుకుంది.  ఆ తరువాత అనేక సినిమాలు తీసి గిన్నిస్ లోకి ఎక్కింది.  జీవితా రాజశేఖర్ కూడా దర్శకురాలిగా మారి తన భర్త నటించిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: