తాప్సీ ప్రధాన పాత్రలో  వీడియో గేమ్ నేపథ్యంలో  అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం 'గేమ్ ఓవర్'.  మొత్తానికి ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతూ ఆకట్టుకుంది.  ఫస్ట్ డే నుండి సినిమాకి బాగా  పాజిటివ్ బజ్ రావడంతో   హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల్లో కలిపి 'గేమ్ ఓవర్'  సూపర్  హిట్ టాక్ తెచ్చుకుంది.  అయితే  రిలీజ్ రోజు నాటి కంటే  ఆ తరువాత రోజు నుండి  కలెక్షన్స్  భారీగా పుంజుకుని స్టడీగా కొనసాగుతున్నాయి.  హిందీలో 88 లక్షలు, తెలుగులో 56 లక్షలు, తమిళంలో 50 లక్షలు కలిపి మొత్తంగా శనివారం నాడు 1.94 కోట్లు రాబట్టింది.


ఇక నిన్న ఆదివారం ఇండియా  పాక్ మ్యాచ్ ఉండటంతో అన్ని సినిమాల కలెక్షన్స్ బాగానే తగ్గాయి. అయితే  'గేమ్ ఓవర్' కలెక్షన్స్  మాత్రం తగ్గలేదు.  శనివారం 1.94 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆదివారంనాడు తెలుగులో 52 లక్షలు, తమిళంలో 78 లక్షలు, హిందీలో 74 లక్షలు కలిపి 2 కోట్లకు పైగానే రాబట్టింది.  దర్శకుడు అశ్విన్ శరవణన్  కథాకథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను జోడించి  అలాగే సస్సెన్స్ ను బాగా ఎలివేట్ చేస్తూ.. సినిమాను చక్కగా మలిచారు.  దాంతో పోటీగా రిలీజ్ అయినా  మిగిలిన మూడు సినిమాల్లో హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: