అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ నెట్‌వర్క్‌లో పెట్టి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. మోడల్స్‌, హీరోయిన్లు, సెలబ్రిటీల విషయంలో ఈ టైపు వేధింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ‘పబ్లిక్‌ ఫిగర్‌ అయినంత మాత్రాన పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు కదా...’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మోడల్‌, నటి శుభ్రా అయ్యప్ప.

 

ఇటీవల నేను బీచ్‌ వెకేషన్‌కు వెళ్లా. అక్కడి బీచ్‌లో బాతింగ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను నేను సరదాగా అప్‌లోడ్‌ చేశా. కొంతమంది వాటిని తీసుకుని అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, తిరిగి నాకు పోస్ట్‌ చేశారు. వాటిని చూసి నేను దిగ్ర్భాంతికి గురయ్యా. ఈ గ్లామర్‌ ప్రపంచంలో మా గౌరవాన్ని, ఇమేజ్‌ను కాపాడుకునేందుకు మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫొటోలను చూసినవారంతా నా గురించి ఏమనుకుంటారు?

 

అవును... నేను నటిని. అవును... నేను ఒక మోడల్‌ని. కానీ... నేను పబ్లిక్‌ ఫిగర్‌ అయినంత మాత్రాన పబ్లిక్‌ ప్రాపర్టీని కాదుకదా. నేను విహారయాత్రలో దిగిన బికినీ సూట్‌ ఫొటోలను కొందరు వాళ్ల ఇష్టమొచ్చినట్టుగా, అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియా ద్వారా నా ఇమేజ్‌ను చెడగొట్టాలనుకుంటే ఎలా? ‘ఆ ఫొటోల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని చెప్పానంటే నేను అబద్ధం చెబుతున్నట్టే అవుతుంది. అవి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి.

 

నేనొక మహిళని, ఒక కూతుర్ని, ఒక చెల్లెల్ని. నాక్కూడా నాదైన ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. నేనూ మీలాంటి దాన్నే. సాధారణ భావాలున్న ఒక మామూలు వ్యక్తిని. ఎవరైనా నా మనసును గాయపరిస్తే నాకూ నొప్పి కలుగుతుంది. ఇలా మార్ఫింగ్‌ చేసే మీ పనితనాన్ని మంచి పనులకు ఉపయోగించండి. మీకు ఇంకా సమయం చిక్కితే మరింత ఆనందంగా జీవించండి. ఇతరులకు ఫోటోషాప్‌ పాఠాలు చెప్పండి. మీ టాలెంట్‌ను ఆ విధంగా వాడండి అని కితాబిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: