ఈ మధ్య కాలం లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అది నిజమని నమ్మేలోపే పెద్ద అబద్ధమని తేలిపోతుంది. చాలా అబద్ధాలు అవి నిజాలు అనే స్థాయిలో ప్రచారం అవుతుంటాయి.  మరోవైపు కొన్ని నిజాలను కూడా జనాలు అబద్దాలు అనుకుంటారు.  రీసెంట్‌గా సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియావరకూ కవర్ చేసిన ఒక హాట్ న్యూస్ 'గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం'. ఈ విషయంపై మణి సార్ సతీమణి సుహాసిని స్పందించారు.  
     
తన ట్విట్టర్ ఖాతా ద్వారా "నా భర్త ఉదయం 9.30 కు ఆఫీసుకు వెళ్ళారు. రూప గారు రుచికరమైన రోటీ.. స్వీట్ మ్యాంగో పికిల్ తీసుకొచ్చారు.  మా ఆయన చక్కగా తిని.. తన కొత్త సినిమా స్క్రిప్టుకు మసాలాను కలిపేందుకు ఆఫీసుకు వెళ్ళారు. మా జీవితాలను స్పైసీగా చేసినందుకు కృతజ్ఞతలు రూప." అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో సుహాసిని గారి సెటైర్ అర్థం కానివారుండరు. మణిరత్నం గారు ఆరోగ్యంగా ఉన్నారని..  మీడియాలో వచ్చిన వార్తలన్నీ గాసిప్స్ అని ఇలా చమత్కారంగా చెప్పారనమాట. గుండెపోటు వస్తే ఎవరైనా ఆవకాయ తిని ఆఫీసుకు వెళ్తారా? మేడమ్ చమత్కారం ఆ రేంజ్ లో ఉంది.


సాధారణంగా ఇలాంటి వార్తలు మీడియాలో వస్తే .. ఆ సెలబ్రిటీ కుటుంబ సభ్యులు మీడియాపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు.  మీడియాకు బాధ్యత ఉండాలని..నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయకూడదని గట్టిగా క్లాసులు పీకుతారు. కానీ మిసెస్ మణిరత్నం మాత్రం స్పైసీగా అవకాయ జోక్ వేశారు. ఇక నుంచైనా ఇలాంటి రూమర్స్ క్రియోట్ చేయకుండా ఉంటే మంచిదని మణి సార్ ఫ్యాన్స్ అంటున్నారట. ఎందుకంటే అందరు సుహాసిని గారిలా ఆవకాయ జోక్ వేయరుగా. కుదిరితే తాట తీసేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: