చిన్న సినిమాలకు తన వంతు చేయూత ఎప్పుడు అందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి అలాంటి ప్రోత్సాహమే అందించారు. తమిళ్ లో గత ఏడాది విడుదలై అద్భుతమైన కమర్షియల్ సక్సస్‌ను సొంతం చేసుకున్న 'కణ' సినిమాను తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కేఎస్ రామరావు 'కౌసల్య కృష్ణముర్తి' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లోని పాత్రను తెలుగులోనూ ఐశ్వర్య రాజేష్ చేస్తుండగా తమిళంలో తండ్రిగా నటించిన సత్యరాజ్ కి బదులు తెలుగులో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 18న చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ముందే ఈ టీజర్ ని చూసేసిన చిరు ఐశ్వర్య రాజేష్ కు స్వయంగా ఫోన్ చేశారు. టీజర్ లోనే చక్కని పెర్ఫార్మన్స్ కనిపించిందని సినిమాలో ఇంకెంత విషయం ఉంటుందో అన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిరు స్వయంగా మాట్లాడి చెప్పడంతో ఐశ్వర్య రాజేష్ షాక్ అయిపోయి నోటమాట రాలేదట. మరి మెగాస్టార్ అంతటి వాళ్ళు ఫోన్ చేసి అభినందిస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది.


ఈ స్వీట్ మెమరీని స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఈ అమ్మాయి మెసేజ్ లోనే చాలా ఎగ్జైట్ అయింది. కౌసల్య కృష్ణమూర్తి నిర్మాత కేఎస్ రామారావు చిరు కు ఎంత సన్నిహితుడో తెలిసిన విషయమే. ఈయన గత ఏడాది తీసిన తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వచ్చింది కూడా చిరునే. ఆ అనుబంధంతోనే మరోసారి ఇలా టీజర్ రిలీజ్ కు సహాయపడుతున్నారు చిరు. మెగాస్టార్ సపోర్ట్ తోడయ్యింది కాబట్టి కౌసల్య కృష్ణముర్తికి ఇంకా పబ్లిసిటీ లో క్రేజ్ వచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: