నీతి కధలు బాగా చెబుతారు. పేదా గొప్ప ఒక్కటే అంటారు, కులాలు మతాలు అసలు లేవు అంటారు. అంత సమానమేనని కబుర్లు చెబుతారు. భారీ డైలాగులు కూడా వల్లిస్తారు. పేదవాడికి అండగా నేనున్నానంటూ బోర విడుస్తారు. కానీ అసలు కధ వేరుగా. అది పూర్తిగా నలుపే కదా.


సినీ సీమలో  ఉన్నన్ని ఇబ్బందులు ఎక్కడా లేవని అంటూంటారు. కాస్టింగ్ కౌచ్ వివాదాలు, కులాల కంపు, వారస్తవాల జబ్బల చరచే ఇంపు, నటన లేని మహానటులు ఉన్న అద్భుతమైన కళా రంగమని అంటారు. మరి ఈ  లుకలుకలు చెప్పనవసరం లేదు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చెసైన హాస్య నటున్ని తమ చిత్రాల్లో తీసుకోబోమని కొందరు పెత్తందారీ పోకడలు కలిగిన పెద్దలు డిసైడ్ చేశారన్న న్యూస్ వైరల్ అవుతోంది.


దాన్ని చూసినపుడు, విన్నపుడు ఇది కదా అసలైన హీరోయిజం అనిపించక మానదుగా. హీర అంటే రియల్ లైఫ్ లో ఇలాగే ఉండాలి కదా. సినిమా తెరపై ఎన్నో సందేశాలు ఇచ్చే వారు నిజంగా ఇలాగే చేయాలి కదా. ఇందులో తప్పేముంది అనిపిస్తుంది. ఎందుకంటే అంతా తెలుసు కాబట్టి. ఆ హాస్యనటుడు తనకు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తే అందులో తప్పేం కనిపించిందో తొక్కేయాలనుకున్నారట. మరి తొక్కేఅండి. ఇలాంటి వారు మళ్ళీ మళ్ళీ నోరెత్తకుండా తొక్కేస్తేనే కదా అసలైన హీరోయిజం. 


వేదికలెక్కి చేప్పే కబుర్లు వేరు. అసలు రూపం వేరు. ఇది ఈ రోజే పుట్టింది కాదు, కొత్తది అంతకంటే కాదు. కొన్ని దశాబ్దాల  క్రితం ఓ వర్ధమాన నటుడు అప్పటి సీనియర్ నటున్ని ఏదో తెలిసీ తెలియక కామెంట్ చేస్తే ఆయన కెరీర్ మొత్తం తొక్కేసిన చీకటి గురుతులు వెనక్కి వెళ్తే కనిపిస్తాయి. ఇలాంటివి ఎన్నో మరి. ఇంతే మేము అలాగే ఉంటాం, మా పెద్దల అడుగు జాడల్లో నడుస్తామంటూ ఇలాంటి విషయాల్లో శపధం చేసి మరీ ముందుకు సాగుతున్న వారిని చూసి గర్వించాలి  మరి. అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: