తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కుర్రకారుని ఎంతగానో అలరించే షో నవ్వించే షో జబర్దస్త్ షో. ఈ షో కి యాంకర్ గా వ్యవహరించే అనసూయ తన అందచందాలతో హాట్ హాట్ బట్టలతో అందంతో తెలుగు కుర్రకారుల మతి పోగొడుతుంది. జబర్దస్త్ షో తో అనసూయ మంచి క్రేజ్ ని సంపాదించింది.
ఒక పక్క సినిమాలు చేస్తూ మరో వైపు జబర్దస్త్ షోల్లో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్న అనసూయ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా లో నటించి బీభత్సమైన క్రేజ్ ని సంపాదించింది. అనసూయకు రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అనసూయకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కథనం అనే చిత్రం చేస్తున్న అనసూయ పలు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఇటు జబర్దస్త్‌కు అటు సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతుందట. అందుకే అనసూయ జబర్దస్త్‌కు దూరం కానుందనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేల అదే కనుక నిజమైతే ఆమె స్థానంలో ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తిగానే కనిపిస్తుంది.