యాంగ్రీ మాన్ రాజశేఖర్  ’గరుడవేగ’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చారు. చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. వెంటనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. "అ!" సినిమాతో విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు "ప్రశాంత్ వర్మ" చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ ప్రాజెక్టు కుదుర్చుకున్నాడు.  అదే "కల్కి" ఈ మధ్య వచ్చిన టిజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ నటన అద్భుతంగా ఉందట.

 

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.  రాజశేఖర్ కి పోలీస్ ఆఫీసరు పాత్రలు ఎంత బాగా కలిసొచ్చాయో అందరికీ తెలుసు. ఇంతకు ముందు గరుడవేగ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసరు పాత్రే. ఈ సినిమాలో రాజశేఖర్ కామెడీ టైమింగ్ అదిరిపోనుందట. టీజర్ లో కూడా ఒక డైలాగ్ వినిపించారు.

 

ఈ సినిమాని కె కె రాధామోహన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాడట. ఈ మధ్య ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. రాజశేఖర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని పొగడ్తలతో ముంచెత్తాడు.  ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా విజువల్ ఎఫెక్ట్స్. మొన్న విడుదలయిన స్పెషల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

 రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి' .. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదా శర్మ కథానాయికగా సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాను, కె.కె.రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా వెండితెర మీద ఎటువంటి విజయం సాధిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: