హీరోలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా కనిపిస్తారు. ఆ పాత్రకి తగ్గట్టు తమ లుక్ ని మార్చుకుంటారు. లేదంటే అన్ని సినిమాలు ఒకే రకంగా కనిపించి, ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సుంది. అందుకని పాత్రకి తగ్గట్టు, తమ బాడీని, హేర్ స్టైల్ ని మార్చుకుంటారు. ప్రతీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు హీరో ఫస్ట్ లుక్ విడుదల ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతుంటారు.

 

మహేష్ బాబు తన 25 వ సినిమా మహర్షికి  కాలేజీ కుర్రాడిలా కనిపించడం కోసం తన గెటప్ ని మార్చాడు. ఆ సినిమాలో చాలా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. సినిమా కి మిశ్రమ స్పందన వచ్చినప్పటికి 100 కోట్ల గ్రాస్ సాధించింది. మహేష బాబు కెరీర్  లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

 

మహర్షి తర్వాత తన తర్వాతి చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి చెప్పిన కథ మహేష్ బాగా నచ్చిందట. ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ ఆఫీసరు పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాని " క్రిష్ణ " గారి జన్మదిన సందర్భంగా లాంచ్ చేసారు. ఈ సినిమాకి " సరిలేరు నీకెవ్వరు " అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు.

 

ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు ఇంతవరకు ఆర్మీ ఆఫీసరు గా కనిపించలేదు. ఆటువంటిది ఈ సినిమాలో మహేష్ లుక్ ఏ విధంగా ఉండబోతుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఆర్మీ ఆఫీసరు అంటే  మహేష్ కోర మీసాలతో కనిపిస్తారట. మిలిటరీ కటింగ్ ఉంటుందట. పాత్ర డిమాండ్ మేరకు అలా ఉంటుందట.  మహేష్ గెటప్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: