హృదయ కాలేయం, సింగం 123 తర్వాత హీరోగా ఏ ప్రాజెక్టు చేయని సంపూ, కొన్ని మూవీల్లో క్యారెక్టర్లు చేశారు. అయితే తను ముచ్చటగా మూడోసారి హీరోగా చేస్తున్న సినిమా కొబ్బరి మట్ట. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది.

 

కొబ్బరిమట్ట’ చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గత నాలుగేళ్లుగా బర్న్ అవుతూనే ఉన్నారు. అపుడెపుడో 2015 నుండే ‘కొబ్బరిమట్ట’ పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. చుడాలిమరి, ఇప్పుడైనా ఈ సినిమా చూసే అదృష్టం ప్రేక్షకులకు దక్కుతుందేమో!

 

రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను జూన్ 20న ప్రకటిస్తున్నట్టుగా ప్రమోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తన మార్క్ స్టైల్ తో బిల్డప్ ఇస్తున్నాడు. అన్నట్టు ఇందులో మన సంపూ బెదరగొట్టే డాన్సులు చేసాడు. సంపూ ఒక పేదింటి చెందిన వ్యక్తి.

 

సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దుకాణం నడుపుతూనే సిద్ధిపేటలో ఉన్న మరో నటుడి దగ్గర నటనలో శిక్షణ కోసం వెళ్ళేవాడు. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవాడు. అలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. తర్వాత హైదరాబాదులో మరో సంస్థలో నటనలో శిక్షణలో చేరాడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: