సిసింద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు  అఖిల్. ఆ తర్వాత అక్కినేని కుటుంబం నటించిన " మనం" సినిమాలో తళుక్క్నమన్నాడు.    హీరో గా నటించిన తొలి చిత్రం "అఖిల్" ఈ సినిమాకి వి వి  వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు. ఫైట్స్, డాన్సులు ఈ సినిమాలో బాగా చేసాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.  అలా తన మొదటి సినిమా ఒక ఫ్లాప్ సినిమాగా మారింది.

 

మొదటి సినిమా అపజయం తర్వాత  లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  ఈ సారి " హలో "అంటూ ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమాకి మనం సినిమాకి దర్శకత్వమ్ వహించిన  "విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మనసంతా నువ్వే సినిమా ని మళ్ళీ తీసినట్టుందని  విమర్శలు వచ్చాయి

 

తర్వాత వరుణ్ తేజ్ కి "తొలిప్రేమ" తో హిట్ ఇచ్చిన దర్శకుడు  వెంకీ కుడుకుల దర్శకత్వం లో "మిస్టర్ మజ్ను" గా వచ్చాడు. ఈ సినిమా కొంత ఫర్వాలేదనిపించింది. కానీ అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.  ఈ సినిమా తర్వాత తన తర్వాతి సినిమా ఏంతనేది ఇంకా తెలిసి రాలేదు. తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.

 

అఖిల్ తన తర్వాతి చిత్రం"గీతా ఆర్ట్" బ్యానర్ లో ఉంటుందట. ఈ సినిమాకి " బొమ్మరిల్లు  భాస్కర్ " దర్శకత్వం వహించనున్నారు. ఈ నెల్ 26 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.   ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని నిర్ణయించలేదు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలిసి రాలేదు.ఈ రెండు విషయాలకి సంబంధించిన ప్రకటన కోసమే అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో, అందుకు తగిన టైటిల్ ను గురించిన ఆలోచన చేస్తున్నారట. ఇక కథానాయికగా సాధ్యమైనంత వరకూ కొత్తమ్మాయిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: