టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మొదట విలన్ గా వచ్చి తర్వాత హీరోగా స్థిరపడ్డారు. చిరంజీవి మొదట విలన్ గా నటించినా ఇప్పుడు ఆయన మెగాస్టార్ స్థాయికి ఎదిగారు..మోహన్ బాబు, శ్రీకాంత్,గోపిచంద్ ఇలా ఎంతో మంది హీరోలు కెరీర్ బిగినింగ్ లో విలన్లే.  ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన వెరైటీ కామెడీ మేనరీజంతో అందరిని ఆకర్షిస్తున్నాడు  ప్రియదర్శి.  తెలంగాణ యాసలో మాట్లాడుతూ..కుర్ర హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తున్నాడు.  


తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ..సినీ పరిశ్రమలోకి విలన్ గా నటించాలని వచ్చానని..కానీ నన్ను అందరూ కమెడియన్ గానే ఆదరిస్తున్నా రని అన్నారు.  వాస్తవానికి నాకు విలనీజం అంటే ఎంతో ఇష్టం..అలాంటి పాత్రల్లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించవచ్చు. తెలుగులో నాకు కోటా శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ ల విలనీజం అంటే ఎంతో ఇష్టం..వీరు అన్ని రకాల పాత్రల్లో జీవిస్తారు. 

 అందుకే నేను 'టెర్రర్' .. 'బొమ్మల రామారం' సినిమాల్లో విలన్ గా నటించాను. నా బ్యాడ్ లక్ ఆ రెండు సినిమాల్లో నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో నాకు కావాల్సిన పాత్రల కన్నా ఏదో ఒక పాత్ర చేసి మెప్పించాలనే ఉద్దేశంతో ఉండగా అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో నేను కమెడియన్ గా సెట్ అవుతానని తెలిసిపోయింది.  


అప్పటి నుంచి కామెడీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను.  సినీ పరిశ్రమలో ఏ చిన్న ఛాన్సు వచ్చినా దాన్ని వినియోగించు కొని ప్రేక్షకుల అభిమానం సంపాదించాలి..అప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని ప్రియదర్శి అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: