మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా " కౌసల్య క్రిష్ణమూర్తి " టీజర్ లాంచ్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆ సినిమా హీరోయిన్ అయిన్ ఐశ్వర్య రాజేష్ కి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఒక క్రికెటర్ గా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా బాగుందని, క్రికెటర్ గా చాలా అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు.

 

ఐశ్వర్వ రాజేష్ తమిళ నాడుకి చెందిన తెలుగు కుటుంబం వారే. వీరు సినిమా కుటుంబానికి చెందిన వారు.  సీనియర్ నటి కమెడియన్ శ్రీలక్ష్మీ  ఐశ్వర్యకి మేనత్త అవుతుంది. టీజర్ ని లాంచ్ చేసాక చిరంజీవి మాట్లాడుతూ ఐశ్వర్య రాజేశ్ తమ కొలీగ్ రాజేశ్ కుమార్తేనని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని, ఐశ్వర్య మేనత్త, కమెడియన్ శ్రీలక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తేనని, వారి వారసురాలుగా ఐశ్వర్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

 

క్రికెటర్ పాత్రకోసం నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని సెట్స్ మీదకు రావడం ఆమె అంకితభావానికి నిదర్శనం అని మెచ్చుకున్నారు.ఇక సినిమా గురించి చెబుతూ, ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారని, మనవద్ద కూడా ఆ స్థాయిలో ప్రోత్సాహం అవసరమని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

 

ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తో చిరంజీవి వీడియో కాల్ లో మాట్లాడారు. మీ నాన్న రాజేశ్, మీ మేనత్త శ్రీలక్ష్మి మాకు బాగా తెలుసమ్మా అంటూ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను అభినందించారు. ఈ సినిమా మంచి హిట్ సాధించి తనకి మంచి భవిష్యత్ ఉండాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: