యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సాహో సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.


మేకింగ్ వీడియోతో పాటుగా టీజర్ కూడా సినిమా రేంజ్ తెలియచేసింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సాహో సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాపు లేచిపోయే రేంజ్ లో జరుగుతుంది. వరల్డ్ వైడ్ గా సాహో 320 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇది కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే.


ఇవి కాకుండా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లెక్క వేరే ఉంది. అవి కూడా 200 కోట్ల దాకా పలుకుతున్నాయట. సో ప్రభాస్ సాహో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ముందే 500 కోట్ల దాకా బిజినెస్ చేశాడన్నమాట. థియేట్రికల్ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 320 కోట్లని తెలుస్తుంది. ఏరియా వైజ్ బిజినెస్ విషయాలు ఎలా ఉన్నాయో చూస్తే..


ఏపి/తెలంగాణా : 120 కోట్లు 
తమిళనాడు, కేరళ : 25 కోట్లు
కర్ణాటక : 29 కోట్లు
నార్త్ ఇండియా : 100 కోట్లు
ఓవర్సీస్ : 45 కోట్లు 
వరల్డ్ వైడ్ : 320 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: