బాలీవుడ్ భామ కియరా అద్వాని మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో మెరిసిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో ఇక్కడ హిట్ కొట్టింది. బీ టౌన్ లో లస్ట్ స్టోరీస్ అంటూ వెబ్ సీరీస్ తో కాకరేపిన కియరా, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. 


తెలుగులో ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నా బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో ప్రీతి పాత్రలో నటించింది కియరా అద్వాని. షాహిద్ కపూర్ కు జోడీగా కియరా అద్వాని లిప్ లాక్ సీన్స్ లో కూడా అదరగొట్టిందని తెలుస్తుంది.


టీజర్, ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ అవగా కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో కియరా ముద్దు సీన్స్ పై మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తపరచింది. సీన్స్ లో భాగంగానే ముద్దు సీన్స్ ఉంటాయని అలాగని వాటి గురిచి ఆలోచించుకుంటూ కూర్చోమని చెప్పింది. అంతేకాదు ముద్దు పెడితే అదేదో శీళం పోయినంత బాధపడాల్సిన అవసరం లేడని కూడా కామెంట్ చేసింది.  


బోల్డ్ మూవీస్ తోనే కాదు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తేనే కెరియర్ కొన్నాళ్ల పాటు సాగుతుందని గుర్తించి అనుకుంటా కియరా లిప్ లాక్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమానే కాదు అవసరం ఉంటే ఏ సినిమాలో అయినా తాను ముద్దు సీన్స్ చేసేందుకు అసలు వెనుకాడనని చెప్పుకొచ్చింది కియరా. ఇంత కోపరేషన్ ఉంది కబట్టే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయని గుసగుసలాడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: