కాజల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కాజల్  అగర్వాల్ కు ఒక చెల్లి ఉందనే సంగతి తెలుసు కదా.. ఆ చెల్లి పేరు నిషా అగర్వాల్. టాలీవుడ్ లో ఓ మూడు నాలుగు సినిమాల్లో నటించింది.. 'ఏమైంది ఈ వేళ'.. 'సోలో'.. 'సుకుమారుడు'.. నిషా ఫిల్మోగ్రఫీలోని సినిమాలు. ఇవి కాకుండా మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటించింది.  అయితే హీరోయిన్ కెరీర్లో జోరు పెరిగే సమయంలో కరణ్ వాలేచాను వివాహం చేసుకొని శ్రీమతిగా మారింది. 


సినిమాలకు దూరంగా ఉంటోంది.  నిషా -కరణ్ దంపతులకు ఇషాన్ అనే బాబు కూడా ఉన్నాడు.  గత కొన్నేళ్ళుగా గ్లామర్ కు దూరంగా ఉన్న నిషా తాజాగా ఒక్కసారిగా బికినీ గేర్ వేసింది. నిషా ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉంది. ఇండోనేషియాలో బ్యాన్యాన్ ట్రీ బింటన్ అనే రిసార్టులో సేదదీరుతోంది.  ఈ సందర్భంగా తనలోని గ్లామర్ ను ఒక్కసారిగా బైటకు తీసి.. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో దిగి జలపుష్పంలా మారిపోయింది.


ఎన్నో పోజులు ఇచ్చింది..ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  చేపలు నీటిలో ఎంత సహజంగా ఉంటాయో అంత సహజంగా నీటిపై తేలియాడింది.  ఒక ఫోటోలో ఒక కాలిని పైకి లేపింది.. మరో ఫోటోలో పూల్ నీటిలో ఉంటూనే బయట ఉన్నఅందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా పోజిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. గ్లామర్ లో అక్క కాజల్ కు ఏమాత్రం తీసిపోదు ఈ నిషా.

మరింత సమాచారం తెలుసుకోండి: