టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ పోకిరి ముందు వరకు ఒక ఎత్తు అయితే పోకిరి తర్వాత మరొక ఎత్తు. అంతగా పోకిరి సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎదురు లేదు అన్నట్టుగా అప్పట్లో అనేకమైన రికార్డులు సృష్టించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మహేష్ కెరీర్ రూపురేఖలను మార్చేసింది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.


ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన బిజినెస్ మాన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటువంటి క్రమంలో తాజాగా మరో సారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. అప్పట్లో జనగణమన అనే సినిమా మహేష్ బాబు తో చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబు తో అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కచ్చితంగా మహేష్ తో సినిమా చేయడం గ్యారెంటీ అని పూరి చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.


మహేష్ తో జనగణమన ఎప్పుడు తీస్తారు సార్.. ఆ సినిమాలో మహేష్ ని చూడాలనేది అభిమానుల డ్రీమ్ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూరి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.ఆ ప్రాజెక్ట్ కూడా తన డ్రీమ్ అని చెప్పిన పూరి తప్పకుండా త్వరలో రావచ్చని పూరి మరో క్లారిటీ ఇచ్చారు. అంటే రాజమౌళికి మహాభారతం ఎలాగో పూరికి కూడా జనగణమన అనే స్క్రిప్ట్ కూడా కలల ప్రాజెక్ట్ అని అర్ధమవుతోంది. ఇదివరకే మహేష్ కు కథ చెప్పినప్పటికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కెరియర్ ఫుల్లు డిజాస్టర్ లో ఉంది..మరి ఇటువంటి క్రమంలో పూరి జగన్నాథ్ ఎప్పుడు హిట్ కొడతాడా మళ్లీ మహేష్ తో ఎప్పుడు సినిమా చేస్తారా అనే ఆతృతతో ఉన్నారు మహేష్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: