సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియా భవాని శంకర్. ఈమె సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యి  చినబాబు సినిమాలో కార్తీ సరసన నటించింది. ఇందులో ఈమె నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు అందుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన ఎస్ జె సూర్య సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో  ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.

 

 దీంతో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం మూడు సినిమాలతో ఈ బేబీ బిజీగా ఉంది. ఈ మధ్య సినిమాల్లో ముద్దు సీన్లు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా ముద్దు సీన్లు పెట్టేస్తున్నారు.  మరి హీరోయిన్ గా నటించాలంటే అవన్నీ తప్పనిసరి అన్నట్టు అయింది పరిస్థితి. దీంతో ప్రియా భవాని శంకర్ కూడా దీనిపై పెదవి విప్పింది.

 

ముద్దు సీన్లలో నటించడానికి తనకి ఎటువంతి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే తాను నటించడానికి సిద్ధం అని తెలిపింది. అయితే ఇక్కడే ఒక షరతు పెట్టింది. ముద్దు సీన్లు అయితే ఓకే అంట కానీ  బికినీ సీన్ లో నటించడానికి మాత్రం అస్సలు ఒప్పుకోనని చెప్పేసింది.కోలీవుడ్ లో ప్రియా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

 

 అజిత్ - విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తే బావుంటుందని ఫ్యాన్స్ నుంచి ఆమెకు విన్నపాలు అందుతున్నాయి. చాలా మంది స్టార్ హీరో ల పక్కన నటించడానికి ఆఫర్లు వస్తున్నా మరి అభిమానుక్లు కోరుకున్న విధంగా విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరో ల నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: