కాజల్ అగర్వాల్... ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ నటి. చేతిలో అవకశాలు బగానే ఉన్నాయి. తాజాగా విడుదలైన సీత సినిమా అమ్మడికి అనుకున్నంత అదృష్టానికి తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో కాస్తంత గ్యాప్ తీసుకొని ఎంజాయ్ మెంట్ చేసింది. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో మన ముందుకు రానున్నట్లు ఆ చిత్ర బృందం తెలిపింది.

పేరుకు సీనియర్ బ్యూటీ అయినా కాజల్  ఫిట్నెస్.. గ్లామర్ విషయంలో కాజల్ కు అసలు వంక పెట్టలేం.  అందుకే ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.  ఈ రోజు ఈ టాలీవుడ్ చందమామ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా 'రణరంగం' టీమ్ కాజల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.

బీచ్ లో అల్ట్రా స్టైలిష్ దుస్తులు ధరించి నవ్వుతూ ఉన్న పోజు చూస్తే ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారు.   ఫ్యాషనబుల్ దుస్తులు మాత్రమే కాదు..  గాల్లోకి ఎగురుతూ ఉన్న కాజల్ హెయిర్  ఈ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది.  హ్యాపీనెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా ఉంది.  ఈ సినిమాలో కాజల్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే.  శర్వానంద్ తో కాజల్ జోడీ కట్టడం ఇదే మొదటిసారి అని  తెలిసిందే.

ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న శర్వాకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు కాజల్ అగర్వాల్ కాగ మరొకరు కళ్యాణి ప్రియదర్శన్.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.   త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.  సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఆగస్టు 2 వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: