ఎన్నికల ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ జూలై మొదటివారంలో  అమెరికాలో ని వాషింగ్టన్ లో జరగబోతున్న ‘తానా’ మహా సభలకు అతిధిగా వెళ్ళడం పవన్ వీరాభిమానులకు ఏమాత్రం మనస్కరించడంలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ కు ఎన్నికలలో జరిగిన ఘోర పరాభవానికి సమాధానంగా పవన్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలలో పెరగాలి కాని ఎక్కడో అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు అతిధిగా వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటూ పవన్ వీరాభిమానులు మధన పడుతున్నలు టాక్. 

అంతేకాదు తమ హీరోకు జరిగిన అవమానాన్ని మరిపించే విధంగా ఒక మంచి సినిమాలో నటించాలి అని తామంత కోరుకుంటూ ఉంటే ఆవిషయాలను పట్టించుకోకుండా అమెరికాలోని తెలుగు సంస్థల కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పవన్ కి ఒక్క శాతం కూడ ఇమేజ్ పెరగక పోగా మరింత అసౌకర్యంగా పవన్ కు పరిస్తుతుతులు ఎదురౌతాయని అభిమానుల అభిప్రాయం.  దీనికితోడు అమెరికాలోని తానా సంస్థకు తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయిన నేపధ్యంలో ఈ సభలకు వెళ్ళడం ద్వారా మళ్ళీ పవన్ తాను తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని అని పరోక్షంగా తెలియచేసినట్లు అవుతుందని పవర్ స్టార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

అయినా ఈ అభిప్రాయాలను పవన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి ఎన్నికల తరువాత పవన్ తన అభిమానులను అదేవిధంగా మీడియాను కలవడానికి ఇష్టపడక పోయినా ఇప్పుడు అమెరికా వెళ్లి ఏకంగా సుమారు 15 వేలమంది హాజరు అయ్యే ‘తానా’ సభలకు వెళ్ళడం నేనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అని అంటున్నారు.

సాధారణంగా తాను నటించే సినిమాల ఫంక్షన్స్ కు రావడానికి కూడ పెద్దగా ఆసక్తికనపరచని పవన్ ఇప్పుడు పనికట్టుకుని తానా మహాసభలకు ఎందుకు వెళుతున్నాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు గత ఎన్నికలలో రాజకీయ పార్టీలు అన్నీ ఓటుకు కనీసం రెండు వేలు ఇచ్చిన పరిస్థుతులలో భారత రాజకీయా లపై ఎన్నికలలో మనీ పవర్ పై పవన్ ఈ సమావేశాలలో కొన్ని ఆ సక్తికర కామెంట్స్ చేసే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: