ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి.  అందులోనూ సెలబ్రెటీల రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగానే పెరిగిపోతుంది.  ఆ మద్య రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు..ఆ తర్వాత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు..ఈ మద్యనే జ్యోతి, రఘు, గీతాసింగ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. 

తాజాగా నటుడు, జబర్ధస్త్ ఫేమ్ చలాకీ చంటికి రోడ్డు ప్రమాదం జరిగింది..కాకపోతే అదృష్టం కొద్ది చిన్నగాయాలతో బయట పడ్డాడు.  సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఈ ఘటన జరిగింది.  విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద ఆగి ఉన్న లారీని ఆయన వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చలాకీ చంటికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే కోదాడలోని ప్రైవేటుఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ట్రీట్ మెంట్ తర్వాత తిరిగి మరోకారులో ఆయన హైదరాబాద్ కి చేరారు...అయితే తాను క్షేమంగానే ఉన్నానని, పెద్దగా గాయాలు కాలేదని చంటి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: