ఇప్పుడిప్పుడే తన టివి షో ల ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్న ముంబై సీనియర్ పోస్ట్ ప్రొడ్యూసర్ సోహన్ చౌహాన్ అనుమానాస్పద మృతి చెందడం బాలీవుడ్ లో కలకలం రేపింది.  ‘ఇండియాస్ గాట్ టాలెంట్ -7’, ‘మాస్టర్ ఛెఫ్ ఇండియా’  పోస్ట్ ప్రొడ్యూసర్ చేసిన సోహాన్ చౌహన్ మృత దేహం  ముంబైలోని రాయల్ పామ్స్ సొసైటీకి చెందిన ఒక చెరువులో దొరికింది.  సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకి తరలించారు. సోహన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 


సోహాన్ చౌహన్ వివాహం జరిగి ఆరు నెలలే అవుతుంది..ప్రస్తుతం భార్య ఢిల్లీలో ఉంటుండగా.. సోహాన్ ముంబైలో ఒంటరిగా ఉంటున్నారు. జూన్ 13వరకు సోహాన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. 'సారేగామాపా' షో గురించి జూన్ 9న ఒక పోస్ట్ కూడా చేశారు.  సోహాన్ ని చివరిగా అతడి ఇంట్లో పనిచేసే వ్యక్తి చూశారు. సోహాన్ చౌహన్ మృతదేమాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.


అయితే సోహాన్ చౌహన్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని..సీసీ ఫుటేజ్ లో సోహాన్ బాటిల్ తీసుకొని బిల్డింగ్ నుండి బయటకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.  ప్రమాద వశాత్తు మరణించారా..లేక ఎవరైనా అతన్ని చంపేసి చెరువులో పవడేశారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: