జూలై మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘ఓ బేబి’ సినిమాను ప్రమోట్ చేస్తూ సమంత అనేక ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. తనకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో తన కామెంట్స్ ను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసే వారి సంఖ్య కూడ రోజురోజుకు పెరిగి పోతోంది అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు గతంలో తన పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను ప్రతిరోజు ఉదయం తెగ చూస్తూ తన మానసిక పరిస్థితి కూడ దెబ్బతిని తనకు తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారి పై విపరీతమైన కోపం కలిగిన సందర్భాలను వివరించింది. అయితే ఆతరువాత తన విచిత్ర పరిస్థితి చూసి నాగచైతన్య ఇచ్చిన క్లాస్ తో తన మానసిక స్థితి కుదుట పడ్డ విషయాన్ని తెలియచేసింది. 

దీనితో ప్రస్తుతం తాను తన పై సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను చూడటం మానేసాను అని కేవలం ఏదైనా ఒక విషయం పై కామెంట్స్ చేసి ఆ కామెంట్స్ కు స్పందన ఎలా ఉంటోంది అన్న విషయం కూడ ఇప్పుడు పట్టించుకోవడం మానేసాను అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఒక విధంగా చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు చాలామంది హీరోలు పెళ్ళి అయిన హీరోయిన్స్ తో నటించడానికి ఎందుకు ఇష్టపడరో తనకు అర్ధం కావడం లేదు అంటూ పెళ్ళి చేసుకున్నంత మాత్రాన హీరోయిన్స్ లో నటించే సమర్ధత తగ్గిపోదు కదా అంటూ ప్రశ్నిస్తోంది సమంత. అయితే సమంత గ్లామర్ షోకు రెడీ అంటున్నా ఆమెచేత అలాంటి పాత్రలలో నటింప చేయడానికి చాలామంది టాప్ హీరోలు ఇష్టపడటం లేదు. అక్కినేని కోడలుగా సమంతను గౌరవ ప్రదంగా చూడాలని మన హీరోల అభిప్రాయం అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: