గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లోని ప్రముఖులు ప్రమదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాణంలో భాగంగా టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య‌ యాక్ష‌న్ సీన్లో  బిల్డింగ్‌పై నుండి కింద ప‌డి గాయ‌పాలయ్యాడు. దీంతో ఆయ‌న ఎడ‌మ కాలికి తీవ్ర‌గాయ‌మైంది. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. 15 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై నుండి నాగ‌శౌర్య కింద‌కి దూకే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న స‌రైన ప్ర‌దేశంలో ల్యాండింగ్ కాక‌పోవ‌డంతో అత‌ని మోకాలికి గాయ‌మైంది. దాదాపు 11 గంటల పాటు వైద్యం చేసిన 25-30 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు పొందిన స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండ‌గా, నాగ‌శౌర్య‌కి గాయం అయింది. ఈ కార‌ణంగా షూటింగ్‌ని నిలిపివేశారు. ఆయ‌న పూర్తిగా కోలుకున్న త‌ర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్ష‌న్ సీన్ కోస‌మని చిత్రం బృందం విశాఖ‌లోని అరిలోవా ప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ ప‌ద‌కొండు రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాని అనుకోకుండా ఇలాంటి అప‌శృతి చోటు చేసుకోవ‌డంతో షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ వేశారు మేక‌ర్స్.

నాగశౌర్య కాలిగి గాయం అయినందున ప్రస్తుతం ఏ సినిమా చేయ్యలేడు. దాదాపు నెల లేదా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం నాగ‌శౌర్య‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామర్శించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించారు. ర‌చ‌యిత‌ బీవీఎస్ ర‌వి కూడా రాఘ‌వేంద్ర‌రావుతో పాటు ఉన్నారు.శౌర్యతో కాసేపు దర్శకేంద్రుడు సరదా ముచ్చటించుకున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1141257304240615424/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1141257304240615424&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema-news-telugu%2Fraghavendra-rao-wishes-naga-shaurya-a-speed-recovery-1-1-10599332.html

మరింత సమాచారం తెలుసుకోండి: