సమీరా రెడ్డి అప్పట్లో ఎన్టీఆర్ సరసన నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే తరువాత తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పటికే పలుమార్లు ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ చేసిన ఈ భామ తాజాగా మరోసారి తన ఫోటో షూట్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. హాలీవుడ్ నటీమణి మార్లింగ్ మన్రో ట్రేడ్ మార్క్ పోజు తెలుసు కదా?  ఒక గౌన్ వేసుకుంటుంది.. ఆ గౌన్ గాలికి ఎగురుతూ ఉంటే చిలిపిగా నవ్వుతూ రెండు చేతులతో ఎగరకుండా పట్టుకుంటుంది.


ఈ పోజును బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ ఎంతోమంది హీరోయిన్లు ఇచ్చారు.. కానీ ఒక ప్రెగ్నెంట్ హీరోయిన్ ఈ స్టైల్ లో ఫోటో షూట్ చేయడం మాత్రం మొదటి సారి.  ఈ ఫోటో షూట్ కోసం ఫ్యాన్స్ వాడలేదు కానీ సమీరానే తన గౌన్ ను అలా ఎత్తి పట్టుకుంది.  ఫోటో మాత్రం సూపర్ అంటే సూపర్.  ఆరెంజ్ కలర్ గౌన్..  నేపథ్యంలో కలర్ఫుల్ వాల్ పెయింటింగ్ ఉండడంతో ఫోటోకు కొత్త అందమే వచ్చిందిఈ ఫోటోకు సమీరా "నా మార్లిన్ మన్రో క్షణం. 


ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇలాంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉంటుందా చెప్పండి? ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ లో ఇది మాత్రం కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఫోటోను మెచ్చుకున్న వారితో పాటు  విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. ప్రెగ్నెంట్ అయి ఉండి ఈ ఫోటో షూట్లు ఏంటని కొందరు చిర్రుబుర్రులాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: