మొత్తానికి తెలంగాణ ప్రాంత ప్రజల కోరిక తీరబోతుంది..మొట్టమొదటి తెలంగాణ స్టూడియో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైదరాబాద్ లో పలు సినిమా స్టూడియో లు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆంధ్రప్రాంత వాసులవే..ఈ ఆంధ్ర ప్రాంత స్టూడియో లు అనే విమర్శ తెలంగాణ ఉద్యమ సమయంలో గట్టిగానే వినిపించింది. 


అప్పట్లో కేసీఆర్ సైతం తెలంగాణ వాసుల ఓ స్టూడియో నిర్మాణం జరగాలని..అధికారంలోకి వస్తే అది తప్పకుండ చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఆ మాట ప్రకారమే మొట్ట మొదటి తెలంగాణ స్టూడియోకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.


దర్శకుడు ఎన్ శంకర్ కు స్టూడియో నిర్మాణానికి గాను అయిదు ఎకరాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఇన్నాళ్ల తరువాత ఓ స్టూడియో నిర్మాణం మళ్లీ వార్తల్లోకి రావడం ఇదే ప్రథమం. దర్శకుడు ఎన్ శంకర్ తెలంగాణ ఉద్యమ పోరాటానికి తన వంతు సాయం అందించారు. ఓ సినిమా కూడా తీసారు. 


ఆయన స్టూడియో నిర్మాణానికి భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు దానికి కదలిక వచ్చింది. ఇండియన్ బిజినెస్ స్కూలు సమీపంలో ఈ స్టూడియో నిర్మాణం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: