మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం మెగాస్టార్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. వీలైనంత త్వరగా డబ్బింగ్ పూర్తి చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకోవాలన్నది చిరు ఉద్దేశ్యం. డబ్బింగ్ అయిపోగానే ఫ్యామిలీ తో కలిసి చిరు కొన్ని రోజులు ట్రిప్ వెళ్ళబోతున్నారు.
వచ్చిన తరువాత మెగాస్టార్ పుట్టిన రోజున కొరటాల శివ సినిమా ఓపెన్ అవుతుంది. అదే రోజున మెగాస్టార్ సైరా ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట. ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా ట్రైలర్ రిలీజ్ అవుతుండగా మరోవైపు అదే రోజున మెగాస్టార్ 152 వ సినిమాను ప్రారంభం కాబోతుండటం విశేషం.
ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ తరువాత బిజినెస్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్ మాగ్నిఫిషియంట్ గా ఉన్నది అంటే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.
అదరహో అనిపించే విధంగా సినిమా ఉంటుంది అని అనుకోవచ్చు. ఈలోగా ఆగష్టు 15 వ తేదీన ప్రభాస్ సాహో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ నాటికి ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ కలెక్షన్లు వస్తాయి కాబట్టి.. మెగాస్టార్ ఆ సినిమాను టార్గెట్ చేసుకుంటాడని అనుకోవచ్చు.