చాలా గ్యాప్ తరువాత బ్లాక్ బ్యూటీ  అమలాపాల్  ''ఆడై'' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  కాగా నిన్న రిలీజ్  అయిన ఈ చిత్రం ట్రైలర్ లో  అమలాపాల్ న్యూడ్ గా కనిపించి యువత  మతులు పోగొట్టింది. గాయాలైన శరీరంతో  నూలుపోగు లేకుండా భయంతో వణికిపోతూ కూర్చున్న అమలాపాల్ నటించిన షాట్స్  ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఆ పాత్ర  కోసం  న్యూడ్ గా నటించడానికి కూడా వెనుకాడని అమలాపాల్ ను ఇప్పుడు అందరూ  మెచ్చుకొంటున్నారు.  


అయితే తాజాగా  'ఆడై' మూవీ గురించి  అమలాపాల్  ట్వీట్ చేసింది.  ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్స్ కోరుకునే  ప్రేక్షకులకు మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా  నచ్చుతుందని ఎంతో ఆశతో ఉన్నాం. ఇక ఈ సినిమాకు  కాన్సెప్ట్ రాణి అయితే, విజువల్స్ రాజు. ఈ రాజు, రాణిల గొప్ప వివాహం లాంటి "ఆడై" మూవీని త్వరలో చూస్తారంటూ ట్వీటింది ఈ బ్లాక్ బ్యూటీ. 


మొత్తానికి తన న్యూడ్ షోతో  సినిమాకు బాగానే  పబ్లిసిటీ తెచ్చి పెట్టింది.  కాగా ఈ సినిమాలో  కామిని అనే పాత్రలో నటిస్తున్న  అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో  ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా  సినిమాలో  స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి అమలాపాల్ కి  ఈ సినిమా  భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: