మన తెలుగులో మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రుబెన్స్ వంటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికి త్రివిక్రమ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కు అవకాశమిచ్చాడు. కానీ ఆడియో పరంగా సినిమాకు అసలు ఏమాత్రం ప్లస్ అవలేదు. అయినా కూడా నానీ జెర్సీ సినిమాకి మళ్ళీ అవకాశమిచ్చాడు. ఈ సినిమాలో వినసొంపైన పాట ఒక్కటీ లేకపోవడం అందరిని ఆశ్చర్య పరచింది. పైగా ఈ సినిమాకు ట్యూన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదనే కంప్లైంట్ కూడా ఉంది. అయినా విక్రమ్మ్ కుమార్-నానీ సినిమా గ్యాంగ్ లీడర్ కి మళ్ళీ సంగీత దర్శకుడిగా అనిరుధ్ నే ఎంచుకున్నారు. 

అయితే అనిరుధ్ తో మళ్ళీ ఇదే సమస్య వస్తుందని తాజా సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే అనిరుధ్ రామచంద్రన్ - తమిళనాట యువ సంగీత సంచలనం. కానీ తెలుగునాట సక్సెస్ కాలేకపోతున్నాడు. అజ్ఞాతవాసి, జెర్సీ సినిమాల తరువాత నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా టేకప్ చేసాడు. అయితే అనిరుధ్ దగ్గర వున్న పెద్ద సమస్య టైమ్ కు ట్యూన్ లు అందివ్వకపోవడమే అని టాలీవుడ్ టాక్. అందుకే అనిరుధ్ ను పెట్టుకోవడానికి పెద్ద సినిమాల డైరక్టర్లు, నిర్మాతలు భయపడుతున్నారు. 

గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా జస్ట్ ఒక్క ట్యూన్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్నాడట అనిరుధ్. వాస్తవానికి ఈ సినిమాలో పాటలు తక్కువేనట. మూడు పాటలు మాత్రమే వుంటాయని ఇన్‌సైడ్ న్యూస్. మహా వుంటే సినిమాలో వుండని మరో ప్రమోషనల్ సాంగ్  మాత్రం వుంటుంది. కానీ ఈ నాలుగు ట్యూన్ లకే ఒక్కటి మాత్రం ఇచ్చి, మిగిలినవి పెండింగ్ పెట్టాడని టాక్ వినిపిస్తోంది. ట్యూన్ ఇస్తే పాట రాయించుకుని, చేయించుకోవడం ఒక్కటి మాత్రమేకాదు. చిత్రీకరణ కూడా వుంటుంది.  దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారని, ఇప్పటికే విడుదల డేట్ ప్రకటించినందువల్ల, అనుకున్న టైం కి సినిమా ఫినిష్ చేయాలని ఆయన నానా అవస్థలు పడుతున్నారట. మరి అనిరుధ్ కి ఉన్న అసలు సమస్యేంటనేది ఇంతవరకు కరెక్ట్ గా తెలీదు.


మరింత సమాచారం తెలుసుకోండి: