యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాక సినిమాలు డైరక్ట్ చేయడం, నిర్మించడమే కాకుండా.. చాలా సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు మారుతి. అప్పట్లో చాలా చిన్న సినిమాలు "మారుతి ప్రజెంట్స్" అన్న ఇమేజ్ తో బాగానే పాపులర్ అయ్యాయి. రిజల్ట్ సంగతి పక్కనపెడితే, విడుదలకు ముందు మారుతి పేరు యాడ్ అవ్వడం వల్ల సినిమాకు మంచి హైప్ వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయడంమానుకున్నాడు మారుతి. చిన్న సినిమాలు సమర్పించడం వల్ల ఆ ప్రభావం తను డైరెక్ట్ చేసే పెద్ద సినిమాల మీద చూపించడం మొదలయ్యేసరికి "సమర్పించడం" నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 

ఇప్పుడదే ప్రభావం ఓ చిన్న సినిమాపై గట్టిగా పడింది. ఆ సినిమానే ఫస్ట్ ర్యాంక్ రాజు. నిజానికి ఈ సినిమా మారుతి చేతులమీదుగా రిలీజవ్వాలి. అలా అయ్యుంటే సినిమాకు కాస్త హైప్ వచ్చి ఉండేది. కానీ ఈ సినిమా నుంచి మారుతి తప్పుకున్నాడు. అలా మారుతి బ్రాండ్ లేకుండా, పెద్దగా ప్రచారం లేకుండా థియేటర్లలోకి వస్తోంది ఫస్ట్ ర్యాంక్ రాజు. మారుతి సమర్పించిన, స్క్రిప్టులు అందించిన సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా ఫ్లాపులయ్యాయి. 


లండన్ బాబులు, భలే మంచి చౌకబేరమ్, బ్రాండ్ బాబు లాంటి ఎన్నో సినిమాలు మారుతి చేయి పడినప్పటికీ ఫ్లాపులయ్యాయి. దీనికితోడు మారుతి డైరెక్ట్ చేసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఇప్పట్నుంచి తను డైరక్ట్ చేసే సినిమాలపైన మాత్రమే ఫోకస్ చేయాలని మారుతి గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకే ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా నుంచి తప్పుకున్నాడు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ వారం థియేటర్లలోకి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: