ఒక భాషలో సూపర్ హిట్టయిన సినిమాని వేరే భాషలోను నిర్మించడం ఫిల్మ్ ఇండస్ట్రీలో తరచు జరిగే విషయమే. వీటిలో డబ్బింగ్ సినిమాలుంటాయి, లేదంటే రీమేక్ సినిమాలుంటాయి. కానీ డబ్బింగ్, రీమేక్ మిక్స్ చేసిన సినిమాలు నిజానికి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమానే కౌసల్య కృష్ణమూర్తి. ఈ సినిమా పూర్తిస్థాయి రీమేక్ సినిమా అని చెప్పలేం. అలా అని కంప్లీట్ డబ్బింగ్ సినిమా అని కూడా చెప్పలేము. కోలీవుడ్‌లో లో సూపర్ హిట్ అయిన కణ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది కౌసల్య కృష్ణమూర్తి. మహిళా క్రికెటర్ పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటించింది. ఆమె తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. తమిళ్ లో ఈ పాత్రను సత్యరాజ్ పోషించాడు.


అయితే తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో సీన్లు మాత్రమే షూట్ చేసినట్టుగా లేటెస్ట్ న్యూస్. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న చాలా సన్నివేశాల్ని ఒరిజినల్ కణ సినిమా నుంచి యథాతథంగా వాడినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన శివకార్తికేయన్ కు సంబంధించిన సన్నివేశాల్ని తమిళ వెర్షన్ నుంచి యాజ్ ఇటీజ్ వాడుకుంటున్నారట. ఆ సన్నివేశాలకు డబ్బింగ్ మాత్రం చెబితే సరిపోతుందని ఫ్రెష్ అప్డేట్. 


గతంలో గురు సినిమాకు కూడా ఇలానే చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రితికా సింగ్ కు సంబంధించిన బాక్సింగ్ సన్నివేశాల్ని ఒరిజినల్ వెర్షన్ ను ఉన్నది ఉన్నట్టు వాడేశారు. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తికి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారట. ఇక రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన మెగాస్టార్ స్వయంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని తెగ పొగిడేశారు. దీంతో ఐశ్వర్య ఆనందానికి అవధులు లేకుండా పోయిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: