పెద్ద నిర్మాణ సంస్థలు అంటే పెద్ద హీరోల సినిమాలు వరుసగా నిర్మించడం కాదు మంచి సినిమాలు నిర్మించడం..ఇది మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు గారి మాట. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలని ఎప్పుడు అనుకోలేదు. ఏ సినిమా చేసినా  హిట్టవ్వాలని చూశారు. అందుకే చిన్న స్టార్స్ తో సినిమాలు చేసినా కూడా సురేష్ ప్రొడక్షన్స్ కు ఎక్కువ సక్సెస్ లు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో సురేష్ ప్రొడక్షన్స్ ఎక్కువ సినిమాలు నిర్మించలేదు. అందుకు కారణం ఇదే అంటూ సురేష్ బాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 


ఈ విషయం గురించి సురేష్ బాబు మాట్లాడుతూ నాన్న గారు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, మెగాస్టార్, బాలకృష్ణ వంటి స్టార్స్ వెంట పడి డేట్లు తీసుకునేవారు కాదు. ఆయన అడిగితే ఎవరైనా డేట్లు కాదనకుండా ఇస్తామంటారు. కాని ఆరు నెలలు ఆగండి.. సంవత్సరం ఆగండి అంటే నాన్నకు నచ్చేది కాదు. అందుకే సక్సెస్ కంటిన్యూగా ఉన్న హీరోల దగ్గరకి నాన్న వెళ్లకుండా ఫెయిల్యూర్ తో ఉన్న వారి వెంట వెళ్ళారు. వాళ్ళతోనే సినిమాలు నిర్మించి సక్సెస్ లు అందుకున్నారు. ఎన్టీఆర్ కూడా కాస్త ఆగు అంటే నాన్న ఆగకుండానే వరుసగా సినిమాలు నిర్మించే వారని సురేష్ బాబు చెప్పారు.


మా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టార్స్ లేకుండానే అన్నీ భాషల్లో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ ను  సొంతం చేసుకున్నాయి. అందుకే నాన్న గారి దారిలోనే నేను కూడా వెళుతున్నాను. ఏదైనా పెద్ద సినిమా చేయాలనుకుంటే.. పెద్ద హీరోకు చెందిన కథ ఉంటే తమ్ముడు వెంకటేష్ తో చేసే వాళ్లం అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుసగా చిన్న సినిమాలను నిర్మిస్తున్న సురేష్ బాబు చిన్న సినిమాలకు పెద్ద దిక్కు అయ్యి వాటి పంపిణీకి సాయం కూడా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: