పాపం తాప్సీ తెలుగులో సరైన అవకాశాలు లేకుండా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమా కమర్షియల్‌గా సక్సస్ అయినా కూడా మళ్ళీ తెలుగు సినిమా మాత్రం పడలేదు. అయితే ఈ సినిమా సీక్వెల్‌లో మాత్రం తమన్న నటిస్తున్నట్టు రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. టాలీవుడ్ మాట అటుంచితే బాలీవుడ్‌లో మాత్రం ఒకటి తర్వాత ఒకటి సక్సస్ ని తన ఖాతాలో వేసుకుంటూ మంచి ఆఫర్లను దక్కించుకుంటుంది. ఇక రీసెంట్‌గా వచ్చిన గేమ్ ఓవర్ మీద తాప్సీ చాలా ఆశలు పెట్టుకుంది. మాంచి టాక్ వస్తే, మాంచి సమీక్షలు వస్తే, మాంచి రేటింగ్ లు వస్తే చాలు సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయన్న మాట ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటారన్న సంగతి తెలిసిందే. 


అయితే రివ్యూస్, రేటింగ్స్ అనేవి జొనర్ ను బట్టి, వైవిధ్యాన్ని బట్టి, కంటెంట్ ను బట్టి కూడా వుంటాయి. రివ్యూవర్స్ నచ్చిన సినిమా జనాలకు నచ్చాలని లేదు. రివ్యూవర్స్ నచ్చని సినిమా జనాలు చూడరని లేదు. ఈవారం విడుదలైన గేమ్ ఓవర్ సినిమా పరిస్థితి ఇదే. రివ్యూవర్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కానీ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. బాగుందనే మౌత్ టాక్ అక్కడక్కడ వినిపించింది కానీ థియేటర్లకు దగ్గర కలెక్షన్లు నాలుగు అంకెలను దాటలేదు. పట్టణ ప్రాంతాల్లోనే అయిదు అంకెలు కాస్త అక్కడక్కడ కనిపించాయి.


సీజన్ సరైనది కాకపోవడం, సినిమా బి సి సెంటర్లకు అంతగా పట్టకపోవడంతో, సరైన కలెక్షన్లు రాలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిజానికి తాప్సీ మంచి నటన కనబర్చింది. సినిమా టేకింగ్ కొత్తగా వుంది. అందువల్ల మంచి రివ్యూస్, మంచి రేటింగ్ లు వచ్చాయి. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాకు దూరంగా వుండిపోయారు. దాంతో 'గేమ్ ఓవర్' అయిపోయిందంటున్నారు. మరి తాప్సీ ఎలా ఫీలవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: